ఆఫీస్ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!
- ఏఐ స్టార్టప్ ఉద్యోగంతో పాటు 3 అదనపు ఆదాయ మార్గాలు
- కుక్కల సంరక్షణతో నెలకు రూ.90 వేల ఆదాయం
- ఇల్లు కొనాలనే లక్ష్యంతో అదనపు పనులు
- సిరామిక్ ప్లేట్ల తయారీని వ్యాపారంగా మలిచిన మహిళ
- సోషల్ మీడియాలోనూ కంటెంట్ సృష్టిస్తున్న జెన్నిఫర్
ఉదయం ఉద్యోగం.. సాయంత్రం మరో పని.. రాత్రి ఇంకో ఆదాయ మార్గం. ఈ రోజుల్లో చాలా మంది అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ అభిరుచులనే ఆదాయ వనరులుగా మార్చుకుని విజయవంతమవుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ అలాంటి వారిలో ఒకరు. పూర్తి స్థాయి ఉద్యోగం చేస్తూనే నెలకు దాదాపు రూ.లక్ష అదనపు ఆదాయం సంపాదిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
జీతం సరిపోవడం లేదు
న్యూయార్క్‌లోని ఓ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్‌లో 35 ఏళ్ల జెన్నిఫర్ మార్టినెజ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. అయినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా జీతం సరిపోవడం లేదని భావించింది. ఇల్లు కొనాలి, ఎక్కువగా ప్రయాణాలు చేయాలి అనే లక్ష్యాలు ఉన్నప్పటికీ అవి జీతంతోనే సాధ్యం కావడం లేదని గుర్తించింది. దీంతో అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతకడం ప్రారంభించింది. రెండేళ్ల క్రితం ఓ చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ఆమెకు నెలకు గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతోంది.
కుక్కలే ఆదాయ మార్గం
జెన్నిఫర్ మొదట పెంపుడు కుక్కలను చూసుకునే సేవను ప్రారంభించింది. యజమానులు బయటకు వెళ్లిన సమయంలో కుక్కలను తన ఇంట్లో ఉంచుకుని సంరక్షించడం ఆమె పని. మొదట్లో కుక్కలు ఇబ్బంది పెడతాయేమోనని భయపడినా తర్వాత అది తనకు ఇష్టమైన పనిగా మారిందని చెబుతోంది. ప్రస్తుతం నెలలో 20 నుంచి 25 రోజులు కుక్కలను చూసుకుంటోంది. ఒక్క రాత్రికి 65 డాలర్లు వసూలు చేస్తోంది. దీంతో కేవలం ఈ పని ద్వారానే నెలకు వెయ్యి డాలర్లకు పైగా అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.90 వేలకుపైగా ఆదాయం పొందుతోంది.
హాబీగా మొదలై బిజినెస్‌గా
కొవిడ్ సమయంలో జెన్నిఫర్ సిరామిక్ ప్లేట్లు తయారు చేయడం నేర్చుకుంది. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. ప్రస్తుతం తనే తయారు చేసిన డిజైన్ ప్లేట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. గత ఏడాదిలో దాదాపు 15 ప్లేట్లను విక్రయించినట్లు తెలిపింది. ఒక్కో ప్లేట్‌ను 60 డాలర్లకు అమ్ముతోంది. సంఖ్య తక్కువగా కనిపించినా తన అభిరుచిని ఆదాయంగా మార్చుకోవడంలో ఇది కీలక అడుగని చెబుతోంది.
సోషల్ మీడియాలో మరో ప్రయాణం
జెన్నిఫర్ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటోంది. ఉద్యోగంలో ఒత్తిడి, మానసిక అలసటను ఎలా తగ్గించుకోవాలనే అంశాలపై వీడియోలు రూపొందిస్తోంది. తన రోజువారీ జీవితం, అదనపు ఆదాయ మార్గాలు, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి టిక్‌టాక్‌లో కంటెంట్ సృష్టిస్తోంది. ఈ అదనపు పనులన్నీ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినవేనని ఆమె చెబుతోంది. భవిష్యత్తులో వీటిలో ఏదో ఒకదాన్ని పూర్తిస్థాయి వృత్తిగా మార్చుకోవాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించింది.
డబ్బుతో పాటు మరో లాభం
అదనపు ఆదాయం వల్ల ఆర్థికంగా ప్రయోజనం కలిగిందని జెన్నిఫర్ చెబుతోంది. అయితే డబ్బు కంటే విలువైన మరో లాభం కూడా దక్కిందని పేర్కొంది. కుక్కలను చూసుకునే పనివల్ల తన పరిసరాల్లోని వారితో పరిచయాలు పెరిగాయని, సమాజానికి మరింత దగ్గరయ్యానని తెలిపింది. ఇంట్లో నుంచి ఉద్యోగం చేయడం వల్ల కలిగే ఒంటరితనాన్ని కూడా ఈ పనులు తగ్గించాయని చెప్పింది. కుక్కలతో బయటకు నడకకు వెళ్లడం, కొత్త వ్యక్తులను కలవడం తన జీవనశైలిని మెరుగుపరిచిందని వివరించింది.